బిజెపి ఆధ్వర్యంలో చెత్త పై పన్నును రద్దు చేయాలని కోరుతూ ధర్నా

మున్సిపల్ పరిధిలో చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉచితాలు ఇచ్చాడు పన్నులు పెంచుడు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగిందని అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అశాస్త్రీయం గా చెత్త పన్ను తీసుకొని వచ్చి కరోనా సమయంలో ప్రజలు నడ్డి విరుస్తున్నారని తక్షణమే ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నును రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

అనంతరం పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా, బిజెపి నాయకులు రామయ్యా, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, యస్ ఇమామ్ ఖాసిం, కిలారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..