18వ వార్డు లో కందుల ఆధ్వర్యంలో బాడుడే బాదుడు

 

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 18వ వార్డు నందు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాదుడే- బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

18వవార్డు నాయకులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో కందుల నారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికారు

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడీ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగస్తులు విద్యార్థులను రైతులను అన్ని వర్గాలు కులాల వారిని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు దుల్హన్ పథకం క్రింద తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే 50 వేల రూపాయలను లక్ష రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి పూర్తిగా ఆ పథకం ఎత్తివేశారని
ఉపాధ్యాయులకు ఒక్క వారంలో సిపిఎస్ రద్దు చేస్తానాని వాగ్దానం చేసి మాట తప్పారని మడమ సైతం తిప్పారని ఏద్దేవా చేశారు.

మార్కాపురం జిల్లా సాధన కోసం రెండు నెలలు తెలుగుదేశం ఆధ్వర్యంలో వివిధ రకాల పోరాటం చేశాము అని కానీ జిల్లాల పునర్విభజనలో మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంత లోని అన్ని వర్గాల వారిని మోసం చేశారని వాపోయారు.

ఇక్కడ వైసిపి నాయకులు ఎక్కడ ఈ ప్రాంతం లో భూమి కనబడిన వెంటనే బోర్డు పెట్టేస్తున్నరని కబ్జాదారుల గా మారి ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రజలు ఇకనైనా కళ్ళు తెరచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు బుద్ది చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాటూరి నారాయణ ప్రతాప్, గునుపుడి భాస్కర్ షేక్ రసూల్ సమంతపూడి నాగేశ్వరరావు సయ్యద్ ఇమాంసా మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్ , షేక్ గౌస్ భాష బొడ్డు సుబ్బయ్య కాటూరి శ్రీను జ్యోతి మల్లి నరసింహారావు షేక్ మస్తాన్ వలి మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు