సెప్టెంబర్ 20న తలపెట్టిన మహాధర్నా జయప్రదంచేయండి-సిఐటియు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కార్మికులందరికి కనీస వేతనం 26వేలు అమలుచేయాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన మహాధర్నాలో కార్మికులందరూ పాల్గొనాలని జయప్రదం చేయాలని సిఐటియు ప్రకాశంజిల్లా అధ్యక్షులు యంరమేష్ పిలుపునిచ్చారు.
శనివారం సిఐటియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 కలెక్టరేట్ మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పొదిలి చిన్న బస్టాండ్ నుంచి విశ్వనాథపురం సెంటర్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమలలో కార్మికులకు గత 15సంవత్సరాలుగా వేతనాలు సవరణ జరగకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారని వైసీపి ప్రభుత్వం యజమానులకు కొమ్ముగాస్తూ వేతనాల సవరణకు సలహాబోర్డును నియమింఛకుండా 50లక్షల మందికి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు.
రాష్ట్రంలో స్కీంవర్కర్లకు విపరీతంగా పనిభారం పెరిగిందన్ని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా ఇంటికి పంపటం దారుణమన్నారు.
స్కీంవర్కర్లలలో ఉన్న మహిళలకు ఎటువంటి సెలవులు అమలులో లేవని అన్నారు.కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ కార్మికులకు,స్కీం వర్కర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమావేశానికి సమానవేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు.హెల్త్ అలవెన్సులకి ఆప్కాస్ తో సంబందంలేనప్పటికి దానికి ముడిపెట్టి ప్రతి నగరపంచాయితీ కార్మికుడు 6వేల రూపాయలు నష్టపోవటానికి అదికారులు కారణమవుతున్నారని
అన్నారు.
పలు సమస్యల పరిష్కారానికి తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలన్నారు.
ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు జి.నాగులు,డి.సుబ్బయ్య,బి.కోటేశ్వరావు,,కె.వి.నరసింహం,కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.