“దేశ స్వావలంబన ను దెబ్బతీస్తున్న మోడీ”

ప్రభుత్వరంగ సంస్థలను స్వదేశీ,విదేశీ కార్పోరేట్లకు కారుచౌకగా కట్టబెట్టటం ద్వారా మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్థుందని సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లా ప్రధానకార్యదర్శి యం‌ రమేష్ అన్నారు.

దేశవ్యాప్త సమ్మె రెండొవ రోజు పొదిలిలో యల్.ఐ.సి.ఆఫీసు వద్ద చెవిలో పూలు పెట్టుకొని ధర్నా చేసి అనంతరం మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నవ రత్నాలు,మహారత్నాలుగా పేరొందిన ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మటానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొందన్నారు.

ప్రత్యేకహోదా,విభజన హామీలను అమలు చేయని మోడీ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఉడుముపట్టుతో ఉందన్నారు.

రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తున్న వెనక్కుతగ్గేదిలేదని డంకా మోగించడం కార్పోరేట్ల పట్ల మోడీ ప్రభుభక్తిని తేటతెల్లం చేస్తుందన్నారు.

బ్యాంకులు,యల్.ఐ.సి,ఇనుము,ఉక్కు,పౌరవిమానయానం,రైల్వే,పోర్టులను మార్కెట్ విలువలో 10శాతానికే కార్పోరేట్ లింకు దోచిపెడుతుందన్నారు.

ఈ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు,కార్మికులను దోచుకొనెందుకు 44కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్ని తద్వారాకార్మికులను కట్టుబానిసలుగా మారుస్తున్నారని అన్నారు.

కార్మికచట్టాలను,సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు తుంగలో తొక్కుతు ప్రభుత్వ స్కీమ్స్ లో పని చేస్తున్న కోట్లాది మంది అంగన్వాడి,ఆశా,మధ్యాహ్న భోజన పథకం,వి.ఓ.ఎ.స్వీపర్స్,ఫీల్డ్ అసిస్టెంట్స్,లకు కనీసం వేతనాలు అమలు కావడంలేదు,రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటికి సాగనంపుతున్నారని అసంఘటితరంగ కార్మికులైన హమాలీలు,భవననిర్మాణ కార్మికులు,ప్రవేట్ ట్రాన్స్ పోర్టు,పారిశ్రామిక క్లష్టర్సులో కార్మికులు సంక్షేమానికి సమగ్రచట్టం చేయాలన్న డిమాండును ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు.

నూతన రవాణా చట్టంతో మోటార్ ఫీల్డ్ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.విపరీతంగా పెరిగిన ట్యాక్స్,పెనాల్టీలకితోడు పెట్రోల్,డీజిల్ రేట్లు పెరుగుదల గోరుచుట్టుపై రోకటిపోటులా మారిందన్నారు.

ఈనేపధ్యంలోనే దేశవ్యాప్తంగా రెండురోజులు సమ్మెకు కార్మికవర్గం సమరశంఖం పూరించింద న్నారు.

ఈకార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శేషయ్య,డి సుబ్బయ్య,పి వెంకటేశ్వర్లు,వి వినోద్,ఎం రామకుమారి,సుశీల,బి హజరత్తమ్మ,ఎఐటియుసి మండల కార్యదర్శి కెవిరత్నం,కార్ స్టాండ్ యూనియన్ నాయకులు గౌస్, రసూల్,మస్తాన్, భాషాలు తదితరులు పాల్గొన్నారు.