17వ వార్డు లో బాదుడే బాదుడు

 

పొదిలి నగర పంచాయితీ 17వ వార్డు నందు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక 17వ వార్డు నందు స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి తిరిగి బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్, లీగల్ సెల్ జిల్లా జిల్లా కార్యదర్శి షేక్ షబ్బీర్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి శ్రీను, షేక్ షబ్బీర్, షేక్ యాసిన్, ఠాగూర్ నరసింహా రావు, ముల్లా మహమ్మద్, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు