సర్పంచ్ రేస్ లో రోటీ రబ్బాని

పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ రేస్ లో వైసీపీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ ఇమాంషరీఫ్ రబ్బాని ( రోటీ) ముందు వరసలో ఉన్నారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎన్నికల షెడ్యూల్ త్వరలో రానున్న నేపధ్యంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆశావహులు తమ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ ఓపెన్ జనరల్ లేక బిసి జనరల్ అయ్యో అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం…. దానితో బిసి జనరల్ అయితే సర్పంచ్ గా పోటీ చేయడానికి ప్రముఖ యువ పారిశ్రామికవేత్త ఇమాంషరీఫ్ రబ్బాని (రోటీ) తనదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు పెట్టి తన ముఖ్య అనుచరులు, మిత్రులతో పలు దఫాలుగా సమావేశమై పోటీ చేయుటకు సంసిద్ధత వ్యక్తం చేసి……. పట్టణంలోని పలువర్గాల ముఖ్య నేతల మద్దతు కూడ గట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఏదైనా ఎన్నికల షెడ్యూల్ రిజర్వేషన్ల ప్రకటన తరువాత పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.