శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు : మాకినేని అమర్ సింహా
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు పొదిలి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా అన్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక భారతీయ జనతా పార్టీ మండల పార్టీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 68వ వర్థంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా, మండల నాయకులు మాగులూరి రామయ్యా, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్, ఆకుపాటీ లక్ష్మణ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు