విద్యుత్ చార్జీల పెంపు తక్షణమే ఉపసంహరించుకోవాలి : నూకసాని బాలాజీ

*పొదిలి రెవెన్యూ డివిజన్, మార్కాపురం జిల్లా ఏర్పాటులో ప్రభుత్వం చిన్న చూపు*

*రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి15 సీట్లుకే పరిమితం*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల తక్షణమే ఉపసంహరించుకోవలని తెలుగుదేశంపార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.

కాటమరాజు తీరుణాలకు వెళ్తు మార్గం మధ్యలో పొదిలి పట్టణం దరిశి రోడ్ లోని మారుతి టింబర్ డిపో నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నూకాసాని బాలాజీ మాట్లాడుతూ మాట తప్పును-మడమ తిప్పను అని అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి అన్న మాటలు ఎక్కడకెల్లాయి అని ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన తొలి రోజు తన ప్రసంగంలో ఉద్వేగంతో గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తాను అన్న గాలి కబుర్లు ప్రజలు మరచిపోలేదని ప్రజలు తొందరలోనే వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సంసిద్దులయ్యారని అన్నారు.

విద్యుత్ చార్జీల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సౌర పవన విద్యుత్ పిపిఏలు రద్దు చేయడంతో ప్రజలపై మోయలేని భారం పడిందని, గడచిన రెండున్నరేళ్ళల్లో రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం 37,872 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారని.విద్యుత్ చార్జీల పెంపు ద్వారా 11,611 కోట్లు,పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పులు ద్వారా 26,261 కోట్లు భారం ప్రజలపై మోపారని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలలో ఒకటైన విద్యుత్ చార్జీలను పెంచనని చెప్పి వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 6 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి జగన్మోహన్ రెడ్డి మాటతప్పారు -మడమతిప్పారు అని ముఖ్యమంత్రిని విమర్శించారు.

 

2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన యూనిట్ పై 90 పైసలు పెంచి1300 కోట్లు ప్రజలపై భారం మోపారు.

ఇవన్నికాకుండా ప్రజలనుంచి 3 వేల కోట్ల ట్రూఆప్ చార్జీల వసూలుకు ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇవ్వడాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సవరించిన విద్యుత్ స్లాబులు యథావిధిగా కొనసాగించాలని పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టి ప్రభుత్వ మెడలో వంచైన విద్యుత్ చార్జీల తగ్గేవిధంగా తెలుగుదేశంపార్టీ పోరాడుతుందని బాలాజీ అన్నారు.

ప్రకాశం జిల్లా నడికుడలి అయిన పొదిలిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు మార్కాపురం జిల్లా పరిపాలన సౌలభ్యం ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పాటు చేయకుండా తమకు నచ్చిన విధంగా చేసుకున్నారని వీటి ఫలితం త్వరలో ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎప్పడూ ఎన్నికలు వచ్చిన 15 శాసనసభ సీట్లు మించి రావని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పోల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, పొదిలి కొనకనమిట్ల మండలాల తెలుగు దేశం పార్టీ నాయకులు స్వర్ణ వెంకటేశ్వర్లు,సన్నెబోయిన సుబ్బారావు, ముని శ్రీనివాస్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి,వీరేపల్లి శ్రీనివాస్,అంకాల రోసయ్య, కనకం వెంకట్రావు యాదవ్ వేల్పుల వెంకట కృష్ణంరాజు,పెమ్మని అల్లూరి సీతారామరాజు, బలగాని నాగరాజు, బోడ్డు సుబ్బాయ్య, సుబ్బారావు, చాగంటి వెంకటేశ్వర్లు, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్, కాటూరి వెంకటేశ్వర్లు, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు