ఇసుక మాఫియా నెలరోజుల్లో కట్టడి మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి వెల్లడి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా కుందూరు ప్రెస్ మీట్


పొదిలి మండలంలో 15కోట్లతో అభివృద్ధి పనులు

తోపు పోరంబోకు భూమి చదును పనులలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు నిరాధారమైనవి

జూలై నెలలో పొదిలి పెద్ద చెరువును రిజర్వాయరుగా మార్పు ప్రక్రియ
ప్రారంభం

పొదిలి నగర పంచాయతీ ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుంది

పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఏరియా ఆసుపత్రిగా మార్పు

పేదలకు ఇంటి నివేశన స్థలాల పంపిణీ చేస్తే నవరత్నాల అమలు పూర్తి


ఇసుక మాఫియాను నెలరోజుల్లో కట్ఠడి చేస్తామని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు.


వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలంలో పొదిలి మండలంలో 15కోట్లు రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.



ప్రతిపక్షాలు తోపు పోరంబోకు భూమి చదును పనుల్లో అక్రమాలు జరిగాయని చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని మొత్తం 3కోట్ల 55లక్షల రూపాయలు అంచనాతో పనులు ప్రారంభం అయ్యాయని…… జరిగిన పనులను చూసి అధికారులు అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు.


జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో పొదిలి పెద్ద చెరువును రిజర్వాయరుగా మార్పు చేస్తానని హామీ ఇచ్చారని ప్రస్తుతం ఆ యొక్క ఫైలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఉందని జులై నెలలో పనులు ప్రక్రియ ప్రారంభం కానున్నదని అదే విధంగా పొదిలి గ్రామ పంచాయతీ నగర పంచాయతీగా రూపాంతరం చెందడం ద్వారా అభివృద్ధి చెందుతుందని…… పొదిలి ప్రభుత్వ వైద్యశాలను 30పడకల ఆసుపత్రి నుంచి 80పడకల ఏరియా ఆసుపత్రిగా మార్పు చేయడానికి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని తెలిపారు.

నవరత్నాలలో ఇంటి నివేశన స్థలాల పంపిణీ పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టు ఉంటుందని అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో ఒక సంవత్సరం కాలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని….. ప్రతిపక్షాల ప్రతి ఆరోపణకు వెంటనే స్పందించవలసిన అవసరం లేదని మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వాన్ని అన్నారు.


ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి, జి శ్రీనువాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, హనిమున్ శ్రీనివాస్ రెడ్డి, వర్షం ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.