రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు క్రీడాకారులు ఎంపిక

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు యోగాసనా క్రీడా సంస్థ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె శివాజీ, డి యల్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక పొదిలి బాలురు ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు ఈ వి రంగయ్య అధ్యక్షతనతో జిల్లా స్థాయి యోగాసనాలు పోటీలు నిర్వహించి మెరుగైన ప్రతిభా చూపిన వారిని రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసారు.

ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఈ వి రంగయ్య మాట్లాడుతూ చిన్న తనం నుంచి యోగా అభ్యాసము వలన ఆరోగ్యం, చురుకుదనం కలిగి ఉంటారని అన్నారు.

రాష్ట్ర స్థాయి యోగా జట్టు వివరాలు
8 నుండి 10 సంవత్సరాల వయస్సు కేటగిరీలో 1 . వి వెంకట సాయి నిఖిల్ (పొదిలి) , 2.యస్ యన్ యస్ యసస్వీని (కనిగిరి)

10 నుంచి 12 సంవత్సరాల కేటగిరీ లో

1. కె ఆకాష్ రెడ్డి (దోర్నాల)
2. కె వి వీరాంజనేయులు (దోర్నాల)
3. యస్ రేవంత్ సాయి ( పి సి పల్లి)
4. మధు ప్రియా (పి సి పల్లి )
5. వి నాగలక్ష్మి (గొట్లగట్టు)
6. టి సంజనా (పి సి పల్లి)

12 నుంచి 14 సంవత్సరాల కేటగిరీ

1. పార్థసారథి ( చీరాల)
2. ఎం మహేష్ (దోర్నాల)
3. కె అముల్య (గొట్లగట్టు)
4. ఎం పల్లవి (గణపవరం )

14 నుండి 16 సంవత్సరాల కేటగిరీ

1. ఎం కాశీ వెంకటేశ్వర్లు (దోర్నాల)
2. దుర్గా పరిపూర్ణ చారి (పొదిలి)
3. సిహెచ్ తరుణ్ (పొదిలి)
4. ఎన్ మరియమ్మ (గొట్లగట్టు)
5. కె లావణ్య (రామసముద్రం)

16 నుంచి 18 సంవత్సరాల కేటగిరీ

1. నవీన్ కుమార్ (దోర్నాల)
2. అరవింద్ (ఒంగోలు)
3. కె సోను (హెచ్ ఎం పాడు)
4. యు రాధ (హెచ్ ఎం పాడు)

35 సంవత్సరాల కేటగిరీ

1. యల్ విజయ శ్రీ (చీరాల)

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలు గా యస్ వి రమణయ్య, కె ప్రతిమ వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి వి రెడ్డి, పి డి లు రామకృష్ణ , ప్రసాద్ రావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు