మాజీ సర్పంచ్ ఓంకార్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్టు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకార్ యాదవ్ హత్యాయత్నం కేసులో ఆరుగురు ముద్దాయిల్లో పొదిలి మండలం కొస్తాలపల్లి గ్రామానికి చెందిన దొండ్ల రామిరెడ్డి, చీమకుర్తి మండలం బక్కిరెడ్డి గ్రామానికి గ్రై హాండ్స్ కానిస్టేబుల్ ఇట్ల భాస్కర్ రావు, కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన జగన్నాథం సిసింద్రీ, దూదేకుల నాయబ్ రసూల్, బెస్తావారిపేట మండలం బెస్తావారిపేటకు చెందిన మునగపాటి బాల శివ ప్రసాద్ అనే ఐదుగురిని శుక్రవారం నాడు పొదిలి లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ విలేకరుల సమావేశంలో తెలిపారు

 

ప్రకాశం జిల్లా తేది:25.10.2024 అమాయకులను రక్షించి అసలైన కిరాయికులు హంతకులను పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు కేసును ఛేదించుటలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు. Cr.No 198/2024 U/s 61 (2), 109, 240 r/w 3 (5) BNS నేరము జరిగిన తేదీ:On 05.10.2024 at 22.50 hrs. పిర్యాది:పెమ్మని బాల వెంకటేశ్వర్లు, వయస్సు 50 సం, మధరానగర్, బ్యాంక్ కాలనీ, పొదిలి టౌన్. బాధితుడి పేరు: పెమ్మని ఒమర్, వయస్సు 40 సం, యాదవ కులం, మధరానగర్, బ్యాంక్ కాలనీ, పొదిలి టౌన్.

ముద్దాయిలు:1. పొదిలి టౌన్‌కు చెందిన పొల్లా రమేష్ (పరారీలో ఉన్నారు) 2.దొండ్ల రామిరెడ్డి, వయస్సు 24 సం, పొదిలి మండలం, కొస్తలపల్లి గ్రామం.

  1. ఇట్టా భాస్కర్ రావు, S/o వెంకటేశ్వర్లు, వయస్సు 40 సం, చీమకుర్తి మండలం, బక్కిరెడ్డిపాలెం గ్రామం, ప్రస్తుతం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. JC నం. 3635. (APSP 9వ BN)
  2. జగన్నాధం సిసింద్రీ @ సిసి,వయస్సు 29 సం, రావిపాడు గ్రామం, కంభం మండలం.
  3. దూదేకుల నాయబ్ రసూల్,వయస్సు 20 సం, రావిపాడు గ్రామం, కంభం మండలం .
  4. మునగపాటి బాల శివ ప్రసాద్, వయస్సు 19 సం, బాలికల ఉన్నత పాఠశాల దగ్గర, బేస్తవారిపేట మండలం.

నేరం యొక్క ఉద్దేశ్యం:గాయపడిన వ్యక్తి పెమ్మని ఓంకార్ కు ముద్దాయి అయిన పోల్ల రమేష్ కు మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం లో ఏర్పడిన వివాదాల కారణంగా ఒకరి మీద ఒకరు దుష్ప్రచారాలు చేసుకుని వ్యక్తిగత కక్షలు పెంచుకుని, దాని కారణంగా ఓంకార్ మీద రమేష్ అను వ్యక్తి 4 గురు వ్యక్తులను కిరాయికి ఏర్పరచుకుని ఓంకార్ మీద హత్యాయత్నం చేయడం జరిగింది.

నేరము చేసిన తీరు మరియు అందుకు గల కారణాలు: పెమ్మని ఓంకార్ కి మరియు పోల్ల రమేష్ ఇద్దరూ కలిసి వారిరువురి భాగస్వామ్యంలో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినారు. ఆ సమయంలో వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో, ఓంకార్, రమేష్ ను వారి భాగస్వామి వ్యాపారం నుండి తప్పించగా ఎవరికీ వారు విడి విడిగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ తరువాత రమేష్ దొండ్లేటి రామిరెడ్డి తో కలిసి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వారిరువురు కలిసి ఉన్న సమయంలో పొదిలి మండలం, పోతవరం గ్రామంలో రమేష్ కొంతమంది వద్ద అప్పులు చేయగా, ఓంకార్ మధ్యవర్తి గా ఉండి డబ్బులు ఇప్పించినాడు. వారిరువురు విడిపోయిన తర్వాత పోతవరం గ్రామస్తులు రమేష్ మీద వారిచ్చిన డబ్బులు గురించి కోర్ట్ లో కేసులు వేయగా, ఓంకార్ వారితో కోర్టులో కేసులు వేయించినట్లుగా భావించి అతని మీద ఎక్కువగా కక్ష పెంచుకున్నాడు. అదేకాక రమేష్ మరియు ఓంకార్ లు ఇద్దరు ఒకరి మీద మరొకరు దుష్ప్రచారాలు చేసుకోవడం వలన, రమేష్ మరియు రామిరెడ్డి లు కలిసి కొంటున్న పొలాలకు సంబంధించి సదరు ల్యాండ్ ఓనర్స్ వీరిని నమ్మక వారు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రమేష్ మరియు రామిరెడ్డిలకు భారీగా నష్టం రావడంతో, ఓంకార్ వారిరువురు చేస్తున్న ప్రతిపనికి ఓంకార్ అడ్డం వస్తున్నాడని వారు భావించి, ఓంకార్ ను అంతమొందిస్తే గానీ వారు వ్యాపార రీత్యా ముందుకు వెళ్లలేరని భావించి ఎలాగైనా సరే ఓంకార్ ను చంపాలని ఉద్దేశంతో, వారు చేస్తే దొరికిపోతామని, అందుకు అనుగుణంగా ఎవరైనా కొంతమంది వ్యక్తులను డబ్బులిచ్చి మాట్లాడాలని రమేష్ మరియు రామి రెడ్డి అనుకొని, ఆ క్రమంలో రమేష్ కు ఇట్లా భాస్కరరావు అను గ్రేహాండ్స్ కానిస్టేబుల్ పరిచయం అవ్వగా, రమేష్ అతనితో కొంతకాలం స్నేహం గా ఉంటూ, అతనికి భారీ మొత్తంలో డబ్బులు ఆశ చూపించి మరియు దర్శి మండలంలో అతని ౩ ఎకరాల పొలం ఆన్లైన్ చేయించి అది వేరే వారికి రిజిస్టర్ చేయించుకునే విధం గా రెవిన్యూ వారితో మాట్లాడి అతని పని చేయిస్తానని, రమేష్ భాస్కర్ రావు కు ఆశ చూపించి అతన్ని నేరం చేయుటకు ఒప్పించినాడు. అంతట భాస్కరరావు అతని మేనల్లుడు అయిన కంభం మండలం, రావిపాడు గ్రామానికి చెందిన సిసింద్రీ @ శశి కి విషయం మొత్తం చెప్పి అతని ద్వారా శశి కి తెలిసిన మరో ఇద్దరు నాయబ్ రసూల్ మరియు బాల శివప్రసాదు లను సమకూర్చుకుని, వారు నలుగురు కలిసి పలుమార్లు ఓంకార్ ను చంపుటకు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం అవ్వడంతో, ఆఖరిగా తేది 05.10.2024 న రాత్రి 10.50 PM కు ఓంకార్ ఇంటికి వెళుతుండగా పై నలుగురు ముద్దాయిలు ఒక పథకం ప్రకారం ఇనుపరాట్లతో విచక్షణా రహితం గా ఓంకార్ తలమీద మరియు ఒంటిమీద కొట్టగా అతను స్పృహతప్పి పడిపోగా, ఓంకార్ చనిపోయినాడని అక్కడి నుండి వెళ్లిపోయినారు. ఇందుకు గాను రమేష్, భాస్కర రావు కు 8 లక్షలు నగదు ఇవ్వడానికి ఒప్పుకొనగా, భాస్కర్ రావు అతను ఏర్పాటు చేసుకున్న కిరాయి నిందితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి వారిని నేరం చేయడానికి ఒప్పించినారు. ఆ తదుపరి రమేష్, రామిరెడ్డి మరియు పై నలుగురు ముద్దాయిలు తప్పించుకొనుటకు ఒక కుట్రపూరితంగా పథకం పన్ని రమేష్ తను పోలీసు వారితో మాట్లాడినానని ఎవరైనా నలుగురు వ్యక్తులు వారు చేసిన నేరము తాము చేసినట్లుగా ఒప్పుకొని పోలీసు స్టేషన్ లో లొంగిపోతే వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు డబ్బులు ఇస్తానని తాను పోలీస్ వారితో మాట్లాడినానని, ఎటువంటి ఇబ్బంది లేదనిచెప్పి, పోలీసులు ముందుకు పంపినారు. అమాయకులు అయినా ఆ నలుగురు డబ్బుకు ఆశ పడి పోలీసుల ముందు ఈ నేరం తామే చేసేమని పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పగా పొదిలి సీఐ, ఎస్సై లు వారి మాట్లలను నమ్మి వారిని కోర్ట్ పంపకుండా, నిజాయితీగా విచారణ చేసి అసలుఅయిన నేరస్తులు వారు కాదని తేల్చి త్రీవంగా శ్రమించి పలు ప్రాంతాలను తిరిగి సమగ్ర దర్యాప్తు చేసి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులను బలిచేయకుండా అసలైన కిరాయి హంతకులను 25.10.2024 తేదీన ఆక్స్ఫర్డ్ స్కూల్, పొదిలి వద్ద అరెస్ట్ చేసినారు. ఈ కేసు లో ప్రధాన సూత్రదారి అయిన రమేష్ పరారిలో వున్నాడు. త్వరితగతిన అతని పట్టుకుంటామన్నారు.
ప్రతిభ: అమాయకులను రక్షించి అసలైన కిరాయి హంతకులను పట్టుకున్న దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, పొదిలి ఎస్ఐ వేమన మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.