పొదిలిలో ఘనంగా గాంధీ జయంతి మద్యపాన వ్యతిరేక ఉద్యమ పుస్తకం ఆవిష్కరణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

 

ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థలోనే సమగ్రాభివృద్ధి సాదించబడుతుందని అస్సాం రాష్ట్రప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ యం ఆరీజ్ అహ్మద్ అన్నారు.

ఆదివారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వబాలుర ఉన్నత పాఠశాల‌ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన అస్సాం ప్రిన్సిపల్ సెక్రటరీ యం ఆరీజ్ అహ్మద్ దాసరి గురుస్వామిలు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మద్యపానం వ్యతిరేక ఉద్యమ పుస్తకాన్ని ఐఎఎస్ అధికారి ఆరీజ్ అహ్మద్ ఆవిష్కరించారు.

జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ఐఏఎస్ అధికారి ఆరీజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలందరూ అన్నదమ్ములలాగా ఐకమత్యంతతో మెలగటంలో మహాత్మ గాంధీ స్ఫూర్తిని చాటాలన్నారు.

ప్రజలు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు అభివృద్ధి సాధ్యమని చెప్పే మాటలను ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తిత్వం మహాత్మాగాంధీని ఆయన అన్నారు.

టన్నుల కొద్దిచెప్పి ఏమీచేయనిదానికంటే ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని చేయడం ఎంతో శ్రేయస్కరమని విద్యార్థులు, ప్రజలు అన్ని విషయాలపై పట్టు సాధించాలని ఆయన అన్నారు.

జన విజ్ఞాన వేదిక రాష్ట్రనాయకులు కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మద్యపానంపై నియంత్రణ ఉండాలని లేనిచో ఆరోగ్య పరంగా ఆర్థికపరంగా కుటుంబ పరంగా సామాజికపరంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.

ప్రకాశం జిల్లా జెవివి ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి మాట్లాడుతూ బ్రిటీష్ వాళ్ళను బారతదేశం నుండి పారద్రోలేలా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరిని భాగస్వాములను చేయడంలో మహాత్మా గాంధీ పాత్ర అమోఘమైనదన్నారు.మతసామరస్యం,అంటరానితనం,మద్యనిషేధం,లౌకిక తత్వం,స్వాతంత్రోధ్యమ లక్ష్యాలను కాపాడటమే ద్వారా గాంధి ఆశయాలను సాధించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ గౌరవ అధ్యక్షులు కల్లం సుబ్బారెడ్డి, చిట్టెం శెట్టి వెంకట సుబ్బారావు, గౌరవ సలహాదారులు బెల్లంకొండ సంస్థల అధినేత శ్రీనివాసులు, పొదిలి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చంద్రశేఖర్ దేవప్రసాద్, కొనకనమిట్ల పొదిలి అధ్యక్షులు జి రమేష్ ఐజక్, యుటిఎఫ్ జిల్లాకార్యదర్శులు షేక్ అబ్దుల్ హై ,పి.బాల వెంకటేశ్వర్లు,మండలనాయకులు నాగార్జున, కృపారావు, హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ షేక్ కరిముల్లా బేగ్, ఫెన్షనర్స్ అసోసియేషన్ పొదిలి తాలుకా అధ్యక్షులు ఎ బాదుల్లా, మదార్ వలి, ఆంజనేయ చౌదరి, శ్రీనివాసరావు, విక్రమార్కుడు, వరికుంట్ల వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాసులు, వెంకటరామయ్య, ఓబుల రెడ్డి, గురువయ్య, కోటేశ్వరరావు, రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.