కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు

కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వ్యాక్సిన్ ప్రక్రియ లో పాల్గొంటున్నారు.

వివరాల్లోకి వెళితే పొదిలి సచివాలయలు 5 నందు శనివారం నాడు కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం విధివిధానాల ప్రకారం ప్రజలు వ్యాక్సిన్ వేస్తున్నారు  వేసవి కాలం కావటంతో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఉప్పలపాడు ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా మాట్లాడుతూ మొదట వైద్య ఆరోగ్య సిబ్బందికి తరువాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తరువాత 60 సంవత్సరాల వారికి తరువాత 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఇచ్చారు.

ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రక్రియను ప్రారంభించామని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ‌45 సంవత్సరాలు నిండిన ప్రింట్ , ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులకు సోమవారం ఐదో సచివాలయం నందు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం చేసామని కావునా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఎయన్ఎం,ఆశా, అంగన్వాడీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు