పెరుగుతున్న కోవిడ్ కేసుల పట్ల సమీక్ష సమావేశం

పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో మండల టాస్క్ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి ప్రైమరీ లో 8 మంది సెకండరీ లో 15 మందిని తక్కువ కాకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎయన్ఎం లు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వసంతరావు, మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా, ప్రభుత్వ వైద్యులు వడ్డే నరేంద్ర మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు