దేవాలయాల నందు సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలి: యస్ ఐ సురేష్

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారంనాడు పొదిలి ఎస్సై సురేష్ పట్టణంలోని పలు దేవాలయాలను సందర్శించారు‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి దేవాలయంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.

అనుమానాస్పద సంఘటనలు ఏవైనా జరిగితే ముందుగా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు..