బినామీ పేర్లతో వ్యవసాయ భూమి దోపిడీని అడ్డుకుంటాం: కందుల
కోట్లది రూపాయల విలువైన వ్యవసాయ భూములను వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నాయకులు బినామీ పేర్లతో దోచుకోవడాన్ని అడ్డుకుంటామని మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక నాగేశ్వరరావు సామిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పొదిలి గ్రామ సర్వే నెంబర్ 1177నందు 164ఎకరాలలో రైతులు సాగులో ఉండగా ఇంటి నివేశన స్థలాలు పంపిణీ కోసం రైతులతో చర్చలు జరిపి సాగులో ఉన్న భూమిలో 60శాతం రైతులకు…… 40శాతం ఇంటి నివేశన స్థలాల కోసం ఇచ్చే విధంగా రెవెన్యూ శాఖతో ఒప్పందం కుదిరింది.
కాని అధికార వైకాపా నాయకులు ప్రస్తుతం రైతుల నుంచి తీసుకున్న భూములను బినామీ పేర్లతో దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని….. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
ఇంటి నివేశన స్థలాల పంపిణీలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని…… అనర్హులకు తప్పితే అర్హులైన వారికి ఒరిగిందేమీ లేదని….. తక్షణమే రెవెన్యూ అధికారులు అనర్హులపై చర్యలు తీసుకుని అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని లేకపోతే పెద్దఎత్తున ప్రతిఘటన తప్పదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి యన్ యస్ యఫ్ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా ,తెలుగుదేశం పార్టీ నాయకులు సమంతపూడి నాగేశ్వరరావు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖూద్దుస్, పండు అనిల్, మీగడ ఓబుల్ రెడ్డి , నరసింహారావు,తదతరులు పాల్గొన్నారు.