గొప్ప సంఘసంస్కర్త పోతులూరి : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు వెంకటాద్రి స్వామి

భారతదేశంలో గొప్ప సంఘసంస్కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు వెంకటాద్రి స్వామి అన్నారు.

వివరాల్లోకి వెళితే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ముని మనవడు ప్రస్తుత పీఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వామి గురువారంనాడు గుంటూరు వెళుతూ మార్గం మధ్యలో పొదిలి పట్టణంలోని విరాట్ నగర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్ప సంఘసంస్కర్త అని జీవ సమాధి అయి 327సంవత్సరాలు పూర్తి అయిందని అన్నారు.

దేవస్థానం నందు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, బ్రహ్మం, పేరుస్వాముల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.