పట్టణంలో పలు దేవాలయాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
పొదిలి పట్టణంలోని పలు దేవాలయాల్లో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు పొదిలి పట్టణంలోని శివాలయం, మహాలక్ష్మీ దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాలలో పాటుగా పలు దేవాలయాలలో ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు నిర్వహించే గోపూజ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గోవులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం గోవులకు ఉందని…. ప్రతి ఒక్కరు గోవులను పూజించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలు దేవస్థానాల ధర్మకర్తలు మరియు భక్తులు వివిధ దేవాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.