పట్టణంలో పలు రకాల పక్షులు మృతికి కారణం ఏమిటి?
పట్టణంలో పలు రకాల పక్షులు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం నాడు పొదిలి టైమ్స్ ప్రతినిధుల దృష్టికి చివర ప్రాంతంలో వందలాది పక్షులు మృతిచెందిన సంఘటన పై సమాచారంతో పొదిలి టైమ్స్ బృందం మార్కాపురం రోడ్ లోని పట్టణ చివర ప్రాంతంలో పలు ప్రాంతాల్లో వివిధ రకాల పక్షులు మృతి చెందిన సంఘటన లను పొదిలి టైమ్స్ చిత్రీకరించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ నుంచి అప్రమత్తంగా ఉన్నా నేపధ్యంలో పొదిలి పక్షులు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది.
తక్షణమే సంబంధించిన అధికారులు పక్షుల మృతి పై విచారణ జరిపి ప్రజల్లో ఉన్న అపోహలకు తెరదించాలని స్ధానికులు కోరుతున్నాను.