ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక పెద్ద బస్టాండ్ నందు స్వర్గీయ నందమూరి తారకరామారావు
25వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహానేత అని…… సామాజిక న్యాయం, సామాజిక మార్పుకోసం కృషి చేసిన వ్యక్తి అని…… ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన పలు సంస్కరణల ద్వారా జరిగిన మార్పు గురించి మరియు ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దుస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, మండల నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, సామంతపూడి నాగేశ్వరరావు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, భూమా సుబ్బయ్య , పొల్లా నరసింహా యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, యండి గౌస్, షేక్ రసూల్ , సయ్యద్ ఇమాంసా,మీగడ ఓబుల్ రెడ్డి, ముని శ్రీనివాస్, షేక్ సంధాని భాషా, షేక్ యాసిన్, ఠాగూర్ నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.