ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక కొనకనమీట్ల మండలం వెంగళపల్లి గ్రామంలోని స్వర్గీయ నందమూరి తారకరామారావు
25వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహానేత అని…… సామాజిక న్యాయం, సామాజిక మార్పుకోసం కృషి చేసిన వ్యక్తి అని…… ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన పలు సంస్కరణల ద్వారా జరిగిన మార్పు గురించి మరియు ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు యాదవ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, ఒంగోలు పార్లమెంట్ జిల్లా కమిటీ బిసి నాయకులు పొల్లా నరసింహారావు యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, మండల తెలుగు యువత నాయకులు పెరిక సుఖదేవ్ మండల నాయకులు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు