అయ్యోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం నిధి సేకరణ కార్యక్రమం
అయ్యోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమం బిజెపి మరియు హిందూ సంస్థల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభమైంది.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్ధానిక విశ్వనాథపురం రామాలయం నందు బిజెపి మరియు హిందూ సంస్థల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించగా మొదటి భాగస్వామి 10,116రూపాయలు నిధి సేకరణ విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా హిందూ సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యోధ్య రామజన్మభూమి నిర్మాణంలో దేశంలోని ప్రతి ఇంటి నుండి నిధి సేకరణ చేయాలనే లక్ష్యంతో అయ్యోధ్యలో రామమందిరం నిర్మాణ పనుల కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు హిందు సంస్ధలు దేశవ్యాప్తంగా జనవరి 15వ తేది నుండి ఫిబ్రవరి 27 వరకు ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతాపార్టీ కన్వీనర్ మాకినేని అమర సింహా, నాయకులు మాగులూరి రామయ్య, శ్రీనివాసులురెడ్డి, ఏడుకొండలు, రావూరి సత్యనారాయణ, పట్టణానికి చెందిన హిందూ సంస్ధల నాయకులు రమణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.