లాంఛనంగా భూముల రీసర్వే ప్రారంభం
వైయస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు మరియు సురక్ష పథకం ( భూముల రీసర్వే) పథకం లాంఛనంగా ప్రారంభమైంది.
వివరాల్లోకి వెళితే వైయస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు మరియు సురక్ష పథకం ( భూముల రీసర్వే) పథకంలో భాగంగా బుధవారంనాడు స్థానిక రామయకండ్రిక రెవెన్యూ గ్రామం పరిధిలోని భూముల రీసర్వే పథకాన్ని మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మరియు గ్రామ సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.