రెండవ విడతలో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకాశం జిల్లా ఎన్నికల షెడ్యూల్ ను గురువారంనాడు విడుదల చేసిన వివరాల ప్రకారం పొదిలి,కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు సంబధించిన ఎన్నికలు రెండవ విడతలో జరగనున్నట్లు షెడ్యూలును గురువారంనాడు విడుదల చేసింది.

రెండవ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

☞ ఫిబ్రవరి 2నుంచి నామినేషన్ల స్వీకరణ
☞ ఫిబ్రవరి 4వతేది నామినేషన్ల దాఖలకు తుది గడువు
☞ ఫిబ్రవరి 5వతేది నామినేషన్ల పరిశీలన
☞ ఫిబ్రవరి 6వతేది నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
☞ ఫిబ్రవరి 7వతేది అభ్యంతరాలపై తుది నిర్ణయం
☞ ఫిబ్రవరి 8వతేది నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
☞ ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
☞ ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.