ఎన్నికల నిర్వహణలో సమిష్టిగా పనిచేయాలి : యస్ ఐ సురేష్
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని యస్ఐ సురేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశం తహశీల్దారు హనుమంతరావు అధ్యక్షతనతో జరిగింది. ఈ సమావేశంలో పొదిలి యస్ఐ సురేష్ మాట్లాడుతూ నామినేషన్లు దాఖల కేంద్రల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పోలీసుల బందోబస్తు ఉంటుందని నామినేషన్లు ప్రక్రియ లో ఘర్షణ వాతావరణం ఉంటే తక్షణమే తమకు కాని 100కు ఫోన్ చేయ్యాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు