పొదిలి మండలంలో నామినేషన్లు వివరాలు
నామినేషన్ దాఖల కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు తహశీల్దారు
పొదిలి మండలంలోని తలమల్ల , కుంచేపల్లి, సూదనగుంట, మూగచింతల గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాల్లో తొలి రోజు మంగళవారం ఒక్క నామినేషన్ కూడా దాఖల కాలేదని పొదిలి మండలం ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు
అదే విధంగా మండలంలోని నాలుగు నామినేషన్ కేంద్రాలను మండల తహశీల్దార్ హనుమంతరావు సందర్శించగా మూగచింతల నామినేషన్ కేంద్రాన్ని పొదిలి,మర్రిపూడి,కొనకొనమీట్ల,తర్లుబాడు మండలాల ఎన్నికల పరిశీలకులు మహుబుబ్ భాషా సందర్శించారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా యస్ఐ సురేష్ సారధ్యంలో పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేశారు