రాజకీయాల్లో ఒక బ్రాండ్ గా ఎదిగిన కామసాని తన తండ్రిని సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

* ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న యువనేత

* లాక్ డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కామసాని

* తన తండ్రి వెంకట సుబ్బారెడ్డిని సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

* నేడు ముగిసిన ఎన్నికల ప్రచారం

పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఈ ప్రాంత రాజకీయాల్లో ఒక ప్రత్యేక బ్రాండ్ గా ఎదిగిన క్లాస్-1 కాంట్రాక్టర్ కామసాని రామిరెడ్డి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న యువనేత అనడంలో అతిశయోక్తి లేదు……

వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఓపెన్ జనరల్ కావడంతో తొలి రోజునే కామసాని రామిరెడ్డి, కామసాని వెంకట సుబ్బారెడ్డి, కామసాని నారాయణమ్మలు నామినేషన్లను దాఖల చేయగా….. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమయంలో రామిరెడ్డి, నారాయణమ్మలు ఉపసంహరించుకుని కామసాని వెంకట సుబ్బారెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలలో కొనకనమిట్ల మండలంలోని నాగరాజుకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగనున్న విషయం అందరికీ తెలిసిందే!….. అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలోకి దిగిన కామసాని రామిరెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీలో తన తండ్రి వెంకట సుబ్బారెడ్డి విజయం కోసం మూడు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరిగింది.

ఎన్నికల ప్రచారానికి చివరిరోజు గురువారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన పొదిలి టైమ్స్ బృందంతో కామసాని రామిరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి వెంకట సుబ్బారెడ్డి
గుర్తు “మంచం” గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ పంచాయతీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.