రేపటి పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు శనివారం నాడు మండలంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసారు
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో రేపు శనివారం నాడు పొదిలి మండలం పరిధిలోని ఎన్నికలు జరిగే 12 గ్రామ పంచాయతీలకు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల కిట్లును పంపిణీ చేశారు
అదేవిధంగా పొదిలి యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పోలీసులను పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించి వారికి రక్షణ ఏర్పాట్లు గురించి వివరించారు.
పంచాయతీ వారిగా ఎన్నికల సిబ్బందిని తీసుకొని వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనువాసులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు