డిజిటల్ పోస్టాఫీసు డిజిటల్ బ్యాంకింగ్ మేళా
డిజిటల్ పోస్టాఫీసు డిజిటల్ బ్యాంకింగ్ మేళా కార్యక్రమాన్ని పొదిలి పోస్టాఫీసు మేనేజర్ రాఘవరావు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పెద్ద బస్టాండ్ నందు శనివారం నాడు పోస్టాఫీసు శాఖ ఉన్నతాధికారల ఆదేశాల మేరకు మేళా కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టాఫీసు నందు అందిస్తున్న పౌర సేవల గురించి వివరించి సంబంధించిన ఖాతాలను ప్రారంభించారు
అదే విధంగా పోస్టాఫీసు పథకాలు వాటి ఉపయోగాలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉప పోస్టాఫీసు మేనేజర్ సాయి రామ్, ఎపియం యస్ శేఖర్, ఎంఓ శ్రీనివాసులు , బి పి యం లు రమణారెడ్డి, పద్మా, అరుణా మరియు పోస్టాఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు