విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం గేదె మృతి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదె మృతి సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహారీ గోడ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సంబంధించిన బాక్స్ నుంచి బయటకు విద్యుత్తు తీగలను గేదె తాకటం తో విద్యుత్ షాక్ తో గేదె అక్కడికి అక్కడే మృతి చెందింది.
ఈ సందర్భంగా గేదె యాజమాని షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ ఇటివల 70 వేలు రూపాయలు కొనుగోలు చేసామని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణముగా తమ గేదె చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వేలాది మంది విద్యార్థులు తిరిగే ప్రాంతంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే వ్యవహరించటం సరికాదని తక్షణమే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారుల పై చర్యలు తీసుకోని గేదె యాజమాని కి నష్టపరిహారం ఇవ్వాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు