పారా పోలీసుల సేవాలను కొనియాడిన యస్ఐ సురేష్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పని చేసిన పారా పోలీసుల సేవా లను పొదిలి యస్ఐ సురేష్ కొనియాడారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యణ మండపం నందు యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పారా పోలీసుల కృతజ్ఞత సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి మండలంలోని గ్రామ సచివాలయల సిబ్బందిని పారా పోలీసుల పేరుతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వారి సేవలను ఉపయోగించడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయిని జిల్లా యస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కృతజ్ఞత సభ పెట్టమని అదే విధంగా ఉత్తమ ప్రతిభ చూపిన పారా పోలీసులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పారా పోలీసులు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు