బిసి రిజర్వేషన్లు దుర్వినియోగంకు సహాకరిస్తున్న అన్నా రాంబాబు పై చర్యలు తీసుకోవాలని

గిద్దలూరు నగర పంచాయితీ చైర్మన్ పదవి యాదవులకు కేటాయించాలని

అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్

బిసి రిజర్వేషన్లు దుర్వినియోగంకు సహాకరిస్తున్న గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గిద్దలూరు నగర పంచాయితీ బిసి జనరల్ కేటగిరీ కింద రిజర్వేషన్ కావటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చైర్మన్ అభ్యార్ధి గా బలిజ కులస్తుడైన ఆర్డీ రామకృష్ణ ను శాసనసభ్యులు అన్నా రాంబాబు ప్రకటించడం హేయమైన చర్య అని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహా యాదవ్ అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చైర్మన్ అభ్యార్ధి గా ప్రకటించిన అభ్యర్థి రాచర్ల దామోదర రామకృష్ణ గౌడ కుల ధృవీకరణ పత్రం అక్రమంగా సంపాదించి నామినేషన్ దాఖల చేయ్యగా సంబంధించిన అక్రమ కుల ధృవీకరణ పత్రం పై జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేయగా విచారణ వేగవంతం జరగకుండా ఉండేందుకు శతవిధాలా శాసనసభ్యులు అన్నా రాంబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు నగర పంచాయితీ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు

తక్షణమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని శాసనసభ్యులు అన్నా రాంబాబు పై చర్యలు తీసుకోని అక్రమంగా బలిజ కులస్తుడైన ఆర్డీ రామకృష్ణ గౌడ కుల ధృవీకరణ పత్రాన్ని సంబంధించిన దానిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్ యాదవ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, పెమ్మని అల్లూరి సీతారామరాజుయాదవ్ , బాలగాని నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు