డాక్టర్ శ్రీనివాసమూర్తి మృతి

డాక్టర్ శ్రీనివాసమూర్తి మృతి చెందిన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో ప్రైవేటు వైద్యశాల నెలకొల్పి 25సంవత్సరాలకుపైగా వైద్యసేవలను అందించి పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు అత్యంత సుపరిచితుడైన డాక్టర్ శ్రీనివాసమూర్తి ఒంగోలులోని తన నివాసంలో మృతి చెందినట్లు గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు కెయల్ నారాయణ తెలిపారు.

పట్టణంలో వైద్య సేవలను అందించడమే కాకుండా తన శిష్యు బృందంలో 30మందికిపైగా గ్రామీణ వైద్యులను తయారు చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్రీనివాసమూర్తి అని…… ఆయన మృతి చెందడం పట్ల గ్రామీణ వైద్యులు సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు గ్రామీణ వైద్యులు లక్ష్మి నారాయణ తెలిపారు.