వంశపారంపర్య ఆయుర్వేద వైద్యులు శివాజీకి అరుదైన నంది అవార్డు

పొదిలి కేంద్రంగా ఆయుర్వేదంలో వంశపారపర్యంగా వైద్యసేవలు అందిస్తూ అనేక రాష్ట్రాల ప్రజలకు ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తూ వైద్యవృత్తిని వ్యాపారంగా కాకుండా సేవగా నిర్వహిస్తున్న సేవలను గుర్తించి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24క్రాఫ్ట్స్ మరియు క్రియేటివిటీ,కల్చరల్ టాలెంట్ & వేరియస్ స్కిల్స్ సొసైటీ సంయుక్తంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారాలలో పొదిలికి చెందిన దరిశి శివాజీకి నంది అవార్డును ప్రధానం చేసి దుశ్యాలవాలతో ఘనంగా సన్మానించారు.


వంశపారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద వైద్యంలో ఇంతటి అరుదైన నంది అవార్డును అందుకోవడంలో మా పూర్వీకుల అలాగే నాపై ప్రజలకు ఉన్న నమ్మకమే అని ఆయన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

సిసి టివి అద్యక్షులు డా ఆరపల్లి నరేంద్ర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సినీరంగం, టిటిడి దేవస్దానం, బయోడైవర్సిటీ వైస్ చైర్మన్ విజయలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యులు కత్తి మండ ప్రతాప్, విశ్వంభర ట్రస్టు సువర్ణకూమారి , అరుణాచలం చారిటీస్ తో పాటు అంతర్జాతీయ మ్యాజికల్ సతీష్ తోపాటు యోగా గ్రహీత , ప్రముఖ నాయకులు , తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల వారేకాక ఇతర దేశస్దులు కూడ పాల్గొన్నారు.