మర్రిపూడి నందు నూతన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌషల్ చేతుల మీదుగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక మర్రిపూడి గ్రామ నందు నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యస్పీ సిద్దార్థ్ కౌశల్ హాజరై లాంఛనంగా ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
30 సంవత్సరాల నుంచి అద్దె భవనం ఉంటూ ఎట్టకేలకు స్వంత భవనం నిర్మాణం చేసుకోవటం శుభపరిణామని అన్నారు.
ఈ కార్యక్రమంలో దరిశి డిఎస్పీ ప్రకాష్ రావు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు, పొదిలి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.