విశాఖ ఉక్కు పరిరక్షణ బంద్ సంపూర్ణం
నిలిచిన ఆర్టీసీ బస్సులు
మధ్యాహ్నం వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత
విశ్వనాథపురం నుంచి తహాశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ
బంద్ లో పాల్గొన్న తెదేపా, సిపిఎం, సిపిఐ మరియు ప్రజా సంఘాలు
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన రాష్ట్ర బంద్ పొదిలి పట్టణంలో బంద్ విజయవంతమైంది.
వివరాల్లోకి వెళితే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు పొదిలి పట్టణంలో శుక్రవారం నాడు బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు గా దుకాణాలు మూసివేసి విశాఖ ఉక్కు పరిరక్షణ తమ వంతుగా మద్దతు ప్రకటించారు.
బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశాల తో ఆర్టీసీ డిపో బోసిపోయింది.
విశ్వనాథపురం నుంచి తహాశీల్దారు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని ప్రెవేటు మరియు ప్రభుత్వ సంస్థలను విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి కార్యకర్తలు మూసివేయించారు.
రాష్ట్ర బంద్ లో తెలుగు దేశం పార్టీ, సిపిఎం, సిపిఐ మరియు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
బంద్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త
పొదిలి యస్ఐ సురేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం, తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవులూరి యలమంద, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖూద్దుస్, పండు అనిల్, షేక్ గౌస్ బాషా, నరసింహారావు, మూరబోయిన బాబురావు యాదవ్, ఠాగూర్ నరసింహారావు, మీగడ ఓబుల్ రెడ్డి, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు