వైభవంగా మజ్ను వలి దర్గా గంధ మహోత్సవం
మజ్నువలి దర్గా మహోత్సవం వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక తూర్పు పాలెం లోని మజ్నువలి దర్గా మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం దర్గా ధర్మకర్త మహ్మద్ అబ్దుల్ ఖయ్యాం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువ నాయకులు షేక్ హబీబ్ , ముల్లా జిందాభాషా తదితరులు పాల్గొన్నారు