పట్టణంలో రెండు కోవిడ్ కేసులు నమోదు ఉలిక్కిపడ్డ పట్టణ ప్రజలు
పొదిలి పట్టణంలో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం విశ్వనాథపురంలోని బ్యాంకు కాలనీ ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ నిన్న శుక్రవారం నాడు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ అని అధికారులు నిర్థారించారు.
శనివారం నాడు స్థానిక విశ్వనాథపురం బ్యాంకు కాలనీ లో నగర పంచాయితీ అధికారులు శానిటేషన్ చేసారు.
గత కొంతకాలంగా ఎలాంటి కేసులు నమోదు లేకుండా ప్రశాంతంగా ఉన్న పొదిలి పట్టణం లో శుక్రవారం నాడు రెండు కేసులు నమోదు కావడంతో
ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైవుతున్నరు.