బ్యాంకుల ప్రేవేటీకరణ నిరసిస్తూ సమ్మె స్తంభించిన బ్యాంకు సేవలు
జాతీయ బ్యాంకుల ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమ, మగంళవారాల్లో దేశ వ్యాప్త సమ్మె లో భాగంగా సోమవారం నాడు బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నుంచి చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ప్రకటనను నిరసనగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొంటున్నారని అదే విధంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వంరంగ సంస్థలను ప్రైవేటు పరంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కాబట్టిప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సహాకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు హిమబిందు, శశికుమార్, బాలకోటయ్య, కెవి నారాయణరెడ్డి, అంజయ్ కుమార్ యాదవ్ , సిపిఐ కార్యదర్శి కెవి రత్నం, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు