పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన బిసి నాయకులు
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి బిసి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 120 జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ సదన్ లోని గాందీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మబలిదానం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అదే విధంగా అనేక సామాజిక దురాచారాలపై పోరాటం చేసిన యోధుడని అన్నారు.
ఆయన వెంట బిజెపి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు