సర్పంచ్ రావులపల్లి సుమలత ఆధ్వర్యంలో గ్రామ బాట
జువ్విగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ రావులపల్లి సుమలత యాదవ్ ఆధ్వర్యంలో గ్రామబాట నిర్వహించారు.
మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన రావులపల్లి సుమలత యాదవ్ పంచాయతీ పరిధిలోని గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు గురువారం నాడు గ్రామబాట పేరుతో జువ్విగుంట గ్రామ పంచాయతీ నందు పర్యటించి గ్రామస్తులుతో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రావులపల్లి సుమలత యాదవ్ మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు సంక్షేమ పథకాలు అందవలసిన వారి వివరాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ పరిధిలో పరిష్కరించేవి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఇతర అంశాలను అధికారులు దృష్టి తీసుకుని వెళ్లి పరిష్కారానికై కృషి చేస్తానని తెలిపారు