విశ్వనాథపురంలోని రెండు దుకాణాల చోరీ
విశ్వనాథపురంలోని రెండు దుకాణాల నందు చోరీ జరిగిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే విశ్వనాథపురంలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ పిచ్చిరెడ్డి దుకాణం లోని కౌంటర్ నందు ఉన్న 70 వేల రూపాయలు విష్ణు ఎలక్ట్రిక్ దుకాణం లోని కౌంటర్ 10 వేల రూపాయల నగదు ను దొంగిలించిన వ విషయం వెలుగులోకి వచ్చింది.
శనివారం ఉదయం షాప్ తాళాలను పగులకొట్టి ఉన్న విషయాన్ని స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న దుకాణాల యాజమానులు దుకాణం తెరవగానే లోపల కేవలం నగదు మాత్రమే దొంగిలించిన విషయన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.