పొదిలి నగర పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటేందుకు సన్నాహాలు సమావేశం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ పరిధిలోని కాటూరివారిపాలెం గ్రామంలోని కళ్యాణమండపం నందు కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి జరగబోయే పొదిలి నగర పంచాయితీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మరియు గెలుపుకు అవకాశం ఉన్న వార్డులను గుర్తించి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో టీమ్ 99 వ్యవస్థాపక సభ్యులు పొదిలి పరిసర ప్రాంతాల కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు