వివిధ గ్రామ పంచాయతీల్లో జలశక్తి అభియాన్ కార్యక్రమం
పొదిలి మండలం పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీ పరిధిలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు ప్రపంచ జల దినోత్సవం లో భాగంగా మండలం పరిధిలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు
కుంచేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ ఆధ్వర్యంలో నీటి పొదుపు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,సచివాలయం సిబ్బంది మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు పండు అనిల్, తదితరులు పాల్గొన్నారు