పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ గడువు మరో ఏడాది పొడిగింపు
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువును మరో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా 78 వ్యవసాయ మార్కెట్ కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 150/2021 తేదీ 24.03.2021 ప్రకారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటేశ్వరి మీడియా తో మాట్లాడుతూ మరో ఏడాది పాటు పాలకవర్గం గడువును పెంచాటంకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేస్తు అందుకు కారకులైన స్ధానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రివర్గం కు కృతజ్ఞతలు తెలిపారు