సర్పంచ్ లు ప్రమాణస్వీకారం బాధ్యతలు స్వీకరణ
గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ లు మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం లో భాగంగా పొదిలి మండలం పరిధిలోని ఓబులక్కపల్లి గ్రామ సర్పంచ్ గా ఆవుల వెంకట సుబ్బారెడ్డి ,జువ్వలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శనగల సుధాకర్ రెడ్డి, సూదనగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కశిరెడ్డి కోటి రెడ్డి ,మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెడ్డిబోయిన సబ్బాయ్య యాదవ్, అక్కచెరువు పంచాయతీ సర్పంచ్ గా చేరెడ్డి వరలక్ష్మి, అన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పులి శ్రీలత, ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చిరుమల్ల శ్రీనివాస్ యాదవ్ ,ఈగలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చిన్నపురెడ్డి సుబ్బులు, ఉప్పలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గుంటూరి ఏసేబు ,కుంచేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వరికుంట్ల కాంతమ్మ,కొండాయపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సన్నేబోయిన మాధవి యాదవ్, తలమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తెల్లమేకల వెంకట సుబ్బామ్మ యాదవ్ , తమ్మగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అంబవరపు తిరుపతి రెడ్డి, పాములపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పేరం చంద్రమ్మ,మూగచింతల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా దేవరపు చిన్నమ్మి,యేలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తాళ్లూరి సింగయ్య,16 గ్రామ పంచాయతీల సర్పంచ్లు మరియు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు