అక్రమంగా నిల్వ ఉంచిన 3 ఇసుక డంప్ లు స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన మూడు ఇసుక డంప్ లను మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ముసి ఇసుక అక్రమంగా డంప్ చేసారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మార్కాపురం ఎఈయస్ డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నాడు జరిపిన తనిఖీలో సుమారు 200 టన్నులు పైగా ఉన్న మూడు ఇసుక డంప్ లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిలో పొదిలి యస్ఇబి యస్ఐ ఎం శ్రీదర్ బాబు, గ్రామ రెవెన్యూ అధికారి సుబ్బారావు,హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు, కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు