ప్రధానితో చర్చాలో పాల్గొన్న పల్లవిని సత్కరించిన విద్యా శాఖ మంత్రి సురేష్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో వర్చువల్ లో మాట్లాడిన పొదిలి విద్యార్థిని పల్లవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక మార్కాపురం లోని మంత్రి నివాసం లో వర్చువల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో మాట్లాడిన పొదిలి విద్యార్థిని పల్లవి వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను పిలిపించుకొని వారిని ఘనంగా సత్కరించారు. పల్లవి కుటుంబ సభ్యులకు మంత్రి సురేష్ కొత్త బట్టలు మరియు యల్ఈడీ టెలివిజన్ ను బహుమతిని అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు