పొదిలి విద్యార్థిని ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం

పొదిలి విద్యార్థిని ప్రశ్నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పినా విషయం ఏమిటంటే


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పైన చర్చా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు తో వర్చువల్ సంభాషించారు . అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పల్లవి మాట్లాడుతూ సంవత్సరం మొత్తం చదివినా తరువాత పరీక్ష సమయంలో ఆందోళన నుండి ఎలా బయట పడాలని అనే ప్రశ్న వేసింది

పల్లవి వేసిన ప్రశ్నకు నరేంద్ర మోడీ మాట్లాడుతూ విద్యార్థులపై ఇంటిలో బయట, పాఠశాల లో ఒత్తిడి తగ్గిస్తే వారు మానసికంగా దృఢంగా తయారై ఎలాంటి భయం కాని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు