ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను స్థానిక విశ్వనాథపురం లోని యాదవ మహాసభ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారి కోసం తమ జీవితాలను త్యాగం చేసారని వారి ఆశయాలతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్ సిరిమల్లే శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహా యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్, స్థానిక నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు, బిసి నాయకులు చాతరాజుపల్లి చంద్రశేఖర్, మచ్చా వెంకట రమణయ్య, పొదిలి టైమ్స్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు